ఏదైనా మాట్లాడాలంటే సమయమూ, సందర్భమూ కావాలనే వారు...
అలాగే మన మాటలు ఎవరికి రీచ్ అవుతున్నాయో.. వారి వేవ్‌లెంగ్త్ కూడా తెలిసి బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడాలని చెప్పేవారు గతంలో!
కానీ ఇలాంటి ప్రిన్సిపుల్స్ అన్నీ మాయమైపోతున్నాయి క్రమేపీ!
-------------------
మాట్లాడడం బలహీనతగా మారిపోయింది. మాటలు ప్రవాహంలా కొట్టుకు వస్తున్నాయి. సునామీలా వాటిని ఎక్కడోచోట ముంచెత్తిస్తే గానీ స్థిమితంగా ఉండట్లేదు.
ఈ హడావుడిలో నోరు జారీ... ఎమోషన్లని కంట్రోల్ చేసుకోలేకా.. ఏదేమో మాట్లాడేస్తున్నాం.
------------------------
ఎప్పుడైతే టార్గెటెడ్ పీపుల్ మెచ్యూరిటీ లెవల్స్, వేవ్ లెంగ్త్ తెలుసుకోలేకపోతున్నామో... చాలా కాంట్రాస్ట్ ఉన్న వందల కొద్దీ మెదళ్లకి అవి వెళ్లిపోయి రకరకాల అర్థాలు ధ్వనింపజేస్తున్నాయి.. సమస్యలు సృష్టిస్తున్నాయి.
ఈరోజు మన నోటి నుండి వెలువడే ఒక్క మాట కూడా సరైన అర్థంలో గ్రహించగలిగే వ్యక్తులు మన చుట్టూ లేరు. దీనికి కారణం... మనకు అర్థం కానంత భారీ అన్‌లిమిటెడ్ ఫ్రెండ్స్ మనకు ఉంటున్నారు. వారు మనకు అర్థమైతేనే మనం వారికి అర్థమయ్యేలా చెప్పగలం.
వేల కొద్దీ friendshipsలో ఇదేదీ సాధ్యపడదు గనుక.. మనం మాట్లాడుతున్న context, feel, wavelength ఏదీ ఎవరికీ అర్థం కావట్లా... రకరకాలుగా స్పందిస్తున్నారు.. ఆ స్పందనలు మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి, వారూ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు.. మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.
-------------------------
సో మాటలు సున్నితంగా ఉన్నప్పుడు ఏ సమస్యా లేదు.. ఏ కారణం చేతైనా కటువుగా మాట్లాడాల్సి వస్తే మాత్రం కత్తిమీద సామే చేయాలి. లేదంటే ఆ కఠినత్వం వెనుక సున్నితత్వం ప్రపంచానికి అర్థం కాదు!
( ee post rasindhi nenu kadhu ... kani nenu idhe bhavanni chala sarlu post cheyalnukoni intha spastanga rayalekapoya .. kani ee post 100% na bhavalaki daggaraga undhi andhuke post chesthunna )
_ Shravan Jakkani
9494722330
9494722330
No comments:
Post a Comment