Tuesday, 18 August 2015

మొన్నీ మధ్య సినిమాలో ఒక సన్నివేశం చూశాను ..
అందులో Kaikala Satyanarayana ..
బాబు అసలు " జీవితంలో.......... "
అని మొదలు పెట్టగానే అందరు అక్కడి నుండి పారిపోతారు
అప్పుడు నాగార్జున ( సినిమా అమెరిక అల్లుడు అనుకుంటా )
ఆ జీవితం లో ....? ... అ చెప్పండి అతరువాత ఏంటి ...
ప్రతీసారి " జీవితం లో .. జీవితంలో....." అంటూ అందరిని తెగ పరిగెత్తిస్తున్నారు ..
ఆ తరువాత ఏంటో చెప్పండి అంటడు ..
అప్పుడు సత్యనారాయణ ..
బాబు అందరు జీవితం లో అని మొదలు పెట్టగానీ వెళ్ళిపోయేవారు ..
అంతటితో నేను అక్కడికే ఆగిపోఎవాన్ని ..
ఇంనేల్లతరువత నువ్వొచ్చి ఇలా తరువాత ఏంటి అని అడిగితే ఎం చెప్పను అంటడు.
ఏది చూసాక ఒక విషయం చెప్పాలి అనిపించింది ఇలాంటిదే ...
ఏదైనా పని చేస్తే నలుగురికి నచ్చేలా ఉండాలి , అంతే కానీ నలుగురు తిట్టేల ఉండకుడదు .. అంటారు అందరు ...
కానీ ఆ నలుగురు ఎవరో మాత్రం చెప్పడం లేదు ,
కనీసం మంచి వాళ్ళో చెడ్డ వాళ్ళో కూడా చెప్పడం లేదు ..
నేను ఆ నలుగురు ఎవరు అని ప్రశ్నిస్తే ఎవరు నోరు మెదపడం లేదు ..
ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియదు ...
ఎవరు ఈ ప్రశ్న వేయలేదు ..
వాళ్ళు అంతటితోనే ఆపేశేవారు ..
నాలాంటి వాడు ఒకడుంటాడు అని ఉహించలేదు ..
ఎం సమాధానం చెప్పాలో తెలియక నన్నే పిచ్చోడిలా చూస్తున్నారు లేదా పెద్దలంటే గౌరవం లేదా అంటున్నారు ....
స్కూల్ లో టీచర్ ని సందేహం అడిగితే .. వాళ్ళకి తెలియనపుడు తిట్టి కుర్చోబెట్టినట్టు ...
వీళ్ళు గౌరవం మర్యాద అంటూ నోళ్ళు మమూయిస్తున్నారు ...
_ జక్కని శ్రావణ్
https://www.facebook.com/jsk22330

No comments:

Post a Comment