Thursday, 24 August 2017

ఒక కళాశాలలో ఇద్దరు విద్యార్థులు ఉండేవారు .. చలా బాగా చదువుకునేవాడు , మంచి వస్తాదరణ , మంచి మాటలు వాళ్ళ మాటలలో ఎప్పుడు చెడు కనపడేది కాదు .. మిగితా వాళ్ళంతా కుళ్ళు జోకులు వేసుకుంటూ అరుస్తూ అల్లరి చేస్తూ ఉండేవాళ్ళు .. ఆ ఇద్దరిని మాత్రం ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ..వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోఎవారు .. కొన్ని రోజులు వాళ్ళు ఇద్దరు వీళ్ళని గమనిస్తూ ఉండేవాళ్ళు .. వాళ్ళకి అందరితో మాట్లాడాలని ఉండేది కానీ కానీ వాళ్ళలా ఉండడం మంచిది కాదు అని ఊరుకునే వారు .. అందులో ఒకడు మెల్లమెల్లగా ఒంటరిగా ఉండలేక మిగితా వాళ్ళలో కలవడం మొదలు పెట్టారు వాళ్ళలాగే మాట్లాడడం , అల్లరి చేయడం కుళ్ళు జోకులు వేయడం మొదలుపెట్టాడు చాలా మారిపోయాడు .. ఎంతగా మరిపోయదంటే అంతకు వాణ్ణి చుసినవల్లెవ్వరు వాడె అని గుర్తించలేనంతగా మారిపోయాడు .. రెండవ వ్యక్తి అది నచ్చక వేరే కళాశాలకి మారాడు
ఒకరోజు చాలారోజుల తరువాత వాణ్ని కలిసిన ఒక పాత స్నేహితుడు వాణ్ణి చూసి చాలా ఆశ్చర్యపోయాడు , కొంత సేపు వాణ్ణి గుర్తుపట్టలేక పోయాడు .. కొత్త సమయం వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్న తరువాత ఆ మిత్రుడు ఇతనిని ఎందుకు ఇంతగా మరిపోయవురా అని అడిగాడు .. దానికి సమాధానంగా అతను “ మంచిగా ఉంటె ఎవడు దేక్తలేడుర “ అని అన్నాడు , మా మాటలకూ ఆ మిత్రుడు ఆశ్చర్యపోయి అదేంట్రా అని అడిగాడు .. అప్పుడు అతను ఇలా చెప్పడం మొదలు పెట్టాడు ..
“ మొదట్లో నేను నాలేనే బుద్ధిగా ఉన్నా .. బాగా చదువుకున్నా .. కానీ నన్ను ఎవరు అంతగా పట్టించుకోలేదు నేను మాట్లాడనిన నాతో ఎవరు అంత సన్నిహితంగా ఉండలేదు .. అందరు నాపైనే జోకులు వేసుకునేవాళ్ళు , నన్నొక వింత మనిషిగా చూసేవాళ్ళు , ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు కాదు ఎవరు నాతో మాట్లాడేవాళ్ళు కాదు , కనీసం నా పక్కన కుడా కూర్చునే వారు కాదు .. కనీ ఇప్పుడు చూడు నా చుట్టూ ఎంతమంది ఉన్నారో నా మాటలకి ( కుళ్ళు జోకులకి ) ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో .. ఒకప్పుడు నేను నా క్లాసు లోని అమ్మాయిలతో మర్యాదగా మాట్లాడినా ఏదో వింతగా చూసేవాళ్ళు నా మాటలు అసలు వినపడనట్టు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు చూడు నేను వాళ్ళని పట్టించుకోకున్నా నన్ను పలకరిస్తున్నారు వాళ్ళపై కుళ్ళు జోకులు వేసినా నవ్వుకుంటున్నారు ఒకప్పుడు నేను రాసుకోవడానికి వాళ్ళ నోట్స్ అడిగితే ఇచ్చేవారు కాదు కానీ ఇప్పుడు నా నోట్స్ కూడా వల్లే రాసిపెడుతున్నారు ’’ అని చెప్పాడు .. ఇకా చాలానే చెప్పాడు అవన్నీ విన్నాక ఆ స్నేహితుడికి ఎం మాట్లాడాలో అర్థం కాలేదు .. అక్కడి నుండి వెళ్ళిపోయాడు
ఒకరోజు నా చిన్నప్పటి మిత్రుడు నేను చాలా రోజుల తరువాత కలుసుకున్నప్పుడు సమాజం మంచిని గుర్తించకపోవడం వాళ్ళ చెడు ఎంతగా పెరిగిపోతుంది అన్న విషయం పై మాట్లాడుతుండగా ఈ విషయం చెప్పాడు .. ఆ మరీనా వ్యక్తికి చాలా రోజుల తరువాత కలిసిన మిత్రుడు , నేను మొదట్లో చెప్పిన రెండవ వ్యక్తి ఎవరో కాదు నాకు ఈ విషయం చెప్పిన నా చిన్నపాటి స్నేహితుడు .. ఇది కేవలం తను చుసిన సంగటన మాత్రమే కదా ఇలా వాళ్ళు మంచిగా ఉంటె గుర్తిపు లేకపోవడం వాళ్ళ చేడు దారిలో వెళ్ళిన వాళ్ళని నా జీవితంలో కూడా చాలామందిని చూశాను .. మీరు చూసుంటారు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి

No comments:

Post a Comment