Thursday, 24 August 2017

ఈ భూమి మీద పుట్టిన ప్రతీజీవి .. తాను బతకడానికి కావలసిన దానికంటే కొంచం కూడా ఎక్కువ ఆశించకుండా ఈ భూమి మీద ఉన్న వనరులను వినియోగించుకుంటున్నాయి ...
అంతే కాకుండా వాటి మిగితా జీవిత కాలాన్ని, శక్తిని .. ఈ భూమికి ఏందో మంచి చేసేవిధంగా మార్చుకున్నాయి ....
చీమలు ఎలుకలు , పందికొక్కులు వంటివి ఈ భూమిలో రంధ్రాలు చేస్తూ వర్షం నీరుని భూమియొక్క అతర్గత జలాశయంలో కి వెళ్ళేలా చేస్తాయి ..
బయట మనం ఎక్కడపడితే అక్కడ పడవేసిన ఆహార పదార్ధాలని , చనిపోయిన కీటకాలని భూమిపైనే పేరుకుపోకుండా అక్కడినుండి వాటిని రంధ్రలలోకి తీసుకువెళ్ళి వాటిని ఎరువుగా ఉపయోగపడేలా చేస్తున్నాయి ..
మొక్కలు తను పండించిన పండ్లని తాము తినడం లేదు మిగితా జీవరాశికి అందిస్తున్నాయి ..
ఇలా ఇంకా ఎన్నో జీవరశుకు ఒక్కో కారణం తో ఈ భూమిని ఈ భూమిమీద ఉన్న వాతావరణ సమతుల్యతని కాపాడి ముందుతరాలకు అందచేయడానికి పనిచేస్తూనే ఉన్నాయ్ ..
కానీ మనిషి మాత్రం ఈ పనీ చేయకుండా ఈ భూమి మీద ఉన్న ప్రతీ వనరులని దోచుకుంటూ ..
ఆ వనరులను కాపాడే జీవరాశులను నాశనం చేస్తూ ... చివరికి తన జాతి మనుగడను కూడా ప్రశ్నార్ధకం చేస్తున్నాడు ...
ప్రతీ జీవరాశికి ఈ భూమిమీద బతికే హక్కు ఉంది ..
ఆ హక్కు కు మనం బంగం కలిగిస్తే మనం కూర్చున్న చెట్టును మనమే నరుకున్న్న వాళ్ళమవుతాం..
_ జక్కని శ్రావణ్
www.jsk22330.blogspot.com

1 comment: